banner
banner
student

AI Plus Campus: అమరావతిలో బిట్స్‌ ‘ఏఐ ప్లస్‌ క్యాంపస్‌’  

రాజధాని అమరావతిలో ‘ఏఐ ప్లస్‌ క్యాంపస్‌’ ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్‌ (బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌) విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా తెలిపారు. అమరావతి క్యాంపస్‌ను ఆధునిక సాంకేతిక విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామని.. కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌ తదితర కోర్సులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. స్మార్ట్, సుస్థిర మౌలిక సౌకర్యాలతో రెండుదశల్లో 7వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని, 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. పిలానీలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘అమరావతిలో వచ్చే ఐదేళ్లలో రూ.1,000కోట్ల పెట్టుబడి పెడతాం. పిలానీ, హైదరాబాద్, గోవా క్యాంపస్‌ల విస్తరణకు ప్రాజెక్టు విస్తార్‌ కింద రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తాం. అక్కడ విద్యార్థుల సంఖ్యను 2030-31 నాటికి 26వేలకు పెంచుతాం’ అని తెలిపారు.

student

10th Class supplementary: ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 28,415 మంది పాస్‌

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 73.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పరీక్షల విభాగం జూన్‌ 27న ఫలితాలను వెల్లడించింది. మొత్తం 42,834 మంది దరఖాస్తు చేసుకోగా..38,741 మంది పరీక్షలు రాశారు. వారిలో 28,415 మంది పాసయ్యారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో 17,034 మంది అబ్బాయిలు, 11,381 మంది అమ్మాయిలున్నారు. జనగామ జిల్లా నుంచి 75 మంది పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 55.90 శాతం ఉత్తీర్ణులయ్యారు. పునఃలెక్కింపు, పునఃపరిశీలనకు జూన్‌ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని

SSC CHSL 2025: ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025  

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2025’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది.

  • (చివ‌రితేది: 18-07-2025)

CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్.. 2025 విద్యా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • (చివ‌రితేది: 20-07-2025)

NMMS scholarship 2025: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS) అనేది కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ కార్యక్రమం, ఇది ఆర్థికంగా బలహీనమైన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని  అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం 8వ తరగతి తరువాత విద్యార్థులు డ్రాప్‌ఔట్ కాకుండా వారిని ప్రోత్సహించడం, ప్రాథమిక విద్యను కొనసాగించడం. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 

  • (చివ‌రితేది: 31-08-2025)

SSC CHSL Recruitment 2025 - 3131 Posts 

Staff Selection Commission (SSC) has released the notification for Combined Higher Secondary (10+2) Level Examination (CHSL), 2025 f

  • (last date: 18-07-2025)
  • Cochin Shipyard - Graduate Marine Engineering Programme

    Cochin Shipyard Limited, Marine Engineering Training Institute, Kochi.. invites applications for admissions to the Graduate Marine Engineering Programme for the academic year 2025.

    • (last date: 20-07-2025)

    National Means-cum-Merit Scholarship Scheme Exam 2025 

    The Ministry of Education, Government of India, implements the National Means-cum-Merit Scholarship Scheme (NMMSS) to support meritorious students from economically weaker sections. the scheme aims

    • (last date: 31-08-2025)
    eenadupratibha
    ibps

    మరిన్ని విభాగాలు

    లేటెస్ట్ ‌  అప్‌డేట్స్‌


    RRB

    ప్రధాన కథనాలు

    student

    Technology: ఏ పొద్దూ.. ఆపొద్దు

    సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందుతోంది.. అందుకనుగుణంగా కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటమే నేటి విద్యార్థులు, ఉద్యోగులు పాటించాల్సిన ఆధునిక మంత్రమని సూచిస్తోంది నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌). భవిష్యత్తు టెక్‌ ప్రొఫెషనల్స్‌ను సిద్ధం చేయడం, అకాడమీ పద్ధతుల పునరాకృతిపై నాస్కామ్‌ తాజాగా నివేదిక విడుదల చేసింది. పారిశ్రామిక అవసరాలు, తరగతులకు మధ్య అంతరాలు తగ్గించేందుకు, నైపుణ్యం కలిగిన విద్యావంతుల తయారీలో విద్యాసంస్థలు కీలక భాగస్వామిగా మారుతున్నాయని పేర్కొంది. సర్వేలో పాల్గొన్న కళాశాలల్లో 68శాతం పాఠ్యప్రణాళిక రీడిజైన్‌ చేయగా...

    లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్

    exam

    తాజా ఫ‌లితాలు

    ఇంగ్లిష్ నేర్చుకుందాం